Sunday, August 8, 2010

నేటి రాజకీయం


టు వేయు నాటి ఓటరు దేముడే
అయ్య పదవి పొంద దెయ్యమాయె
ఓడ మల్లనాయె బోడి మల్లన్నగా
నేటి లోక రీతి పాటు కనుమ

నీతి నియమమెల్ల నిలువు లోతున పాతి
సిగ్గు లజ్జ విడిచి చేరు వాడె
రాజకీయమందు రాణించురా నేడు
నేటి లోక రీతి పాటు కనుమ

కులము మతము ధనము కూడినవారిదౌ
నేర చరిత స్వార్ధ తీరు సైచి
ఓట్లు వేయ గెలిచి ఊళ్ళని దోచడా?
నేటి లోక రీతి పాటు కనుమ

డ్డుపడుట, గోల, అవహేళనంబులు
వెకిలి నవ్వు, తిట్లు, మకిల పనుల
చట్ట సభలతీరు చట్టుబండాయెరా
నేటి లోక రీతి పాటు కనుమ

ర్త మరణమొంద భార్యకు సీటిచ్చి
సానుభూతి పంప చట్టసభకు
పార్టిస్వామ్యమాయె, ప్రజల స్వామ్యమ్మౌనె?
నేటి లోక రీతి పాటు కనుమ


ప్రభుల వైద్యశాల పరిపుష్టి చేయక
అస్మదీయ వైద్యు కనుమతిచ్చి
రోగ భీమ పేర భోగాలు పంచెరా
నేటి లోక రీతి పాటు కనుమ


డ్డి మేసినట్టి గడుసరి లల్లూని
దూరవాణి సంస్త దోచు సచివు
పదవి కొరకు సైప ప్రభువు లంచము కాదె?
నేటి లోక రీతి పాటు కనుమ

సెజ్జు వంక మంచి సేద్యపు భూమినే
పేద నుంచి లాగి పెద్ద కివ్వ
అతనికన్న రాక్షసాంశజు డెవరయా?
నేటి లోక రీతి పాటు కనుమ

మంచి విడచిపెట్టి లంచాలు చేపట్టి
మేటి దైవ భూమి వాట
ట్టి
కల్లు సార కొట్లు కొల్లగొట్టెను నేత
నేటి లోక రీతి పాటు కనుమ

త్మ బంధు,భృత్యు లడిగిన వెంటనే
క్రమము కాని పనుల కనుమతిచ్చి
నేత దోచిపెట్టె జాతి సంపదనెల్ల
నేటి లోక రీతి పాటు కనుమ

మంత్రి పదవి పొంది మన క్షేమ మేమార్చి
ఎదురుతిరుగు వారి నేరివైచి
దోచి దాచుకొనెడి దుష్టుడే మననేత
నేటి లోక రీతి పాటు కనుమ

No comments:

Post a Comment